andhrapradesh
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ
Andhrapradesh
15 Oct 2026
46 views
కూటమి ప్రభుత్వ విజయమే ధ్యేయం, బొజ్జల సుధీర్ రెడ్డితో మిద్దెల హరి బేటి, స్థానిక ఎన్నికలలో సమన్వయంతో ముందుకు,
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గురువారం తిరుపతి జిల్లా పార్లమెంట్ సమన్వయకర్తలు జనసేన పార్టీ నాయకులు మిద్దెల హరి తమ్మినేని వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి సమన్వయకర్త దండి నరేంద్ర, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెంజిగరం రమణ , అనుచరులు, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, పలువురు ప్రముఖులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డిని కలంకారి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే బొజ్జల మిద్దెల హరిని శాలువాతో సత్కరించి తిరుపతి సమన్వయకర్తగా నియమించినందుకు సన్మానించారు ,
ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడుతూ,, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లి 100శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించాలని తెలియజేశారు. మిద్దెల హరి మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెండున్నర సంవత్సరాలలో శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషిచేసి ఎన్నికలలో విజయ డంక మోగిస్తామని తెలిపారు.
జనసేన తిరుపతి సమన్వయకర్త తమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల కోటాలో జనసేన పార్టీకి తగిన ప్రాతినిధ్యం కల్పించుటలో పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ చేసిన సూచనలను శాసనసభ్యులకు వివరిస్తూ తగు న్యాయం జరిగే విధంగా సమన్వయం చేసుకుందామని తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ,, మిద్దెల హరికి బీసీ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయంలో కూడా మా భాగస్వామి ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గురజాల సుబ్బరాయులు, మిద్దెల జయరామయ్య, అన్నచ్చి చంద్ర ,ప్రముఖ న్యాయవాది రమణయ్య, టిడిపి నాయకులు నున్న బాలసుబ్బయ్య, తీర్థం వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ జయదేవనగిరి, వర్తక సంఘం ఉపాధ్యక్షులు దొంతు సుబ్రహ్మణ్యం , సహాయ కార్యదర్శి గంజి వెంకటేష్, చాముండేశ్వరి దేవాంగ సంక్షేమ సంఘం కార్యదర్శి పులి రాధాకృష్ణయ్య, జనసేన పార్టీ నాయకులు, ఈగల హరి రాయల్, తీగల భాను ప్రకాష్, బాలిశెట్టి నరసింహులు, దావాల గిరి, బొజ్జా ప్రభాకర్, కంటా మునిరత్నం, కోటా కరుణాకర్ శెట్టి,చల్లా సుధాకర్, సాధు మునస్వామి, చల్లా చెన్నయ్య, నున్న వీరయ్య, శేషయ్య, లోకయ్య, పైడి రాఘవులు, బండి రమేష్, నున్న చందు, మహర్షి, సౌందర్యరాజన్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.
వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి 9644411197
ట్యాగ్లు:
Latest News