రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు మృతి
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: కారు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు కోలుకోలేక గురువారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ‘లిమ్రాస్ గ్రానైట్ ఫ్యాక్టరీ’లో అంబటి రామగోవిందు అనే వృద్ధుడు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తన నైట్ డ్యూటీ ముగించుకుని, ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా.. వేగంగా వచ్చిన ఒక కారు ఆయనను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రామగోవిందు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం