ఓలేరు గ్రామంలో పొలంబడి
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల పరిధిలోని ఓలేరు గ్రామంలో పొలం బడి కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి బి. బ్రహ్మరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఓ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వారి పోలంలో ఉన్న పంట పరిసరాల మీద దృష్టి సారించాలని సూచించారు. పురుగులు, తెగుళ్ళు ఉదృతి ఎక్కువగా ఉన్నపుడు మాత్రమే రసాయన క్రిమి సంహారక మందులు వాడాలని, తక్కువగా ఉన్న సందర్భంలో శాస్త్రీయ పద్దతుల్లో కంట్రోల్ చేసుకునేలా విధానం అలవాటు చేసుకోవాలి అని తెలిపారు. అదేవిధంగా పొలంబడిలో భాగ స్వామ్యమై ఉన్న రైతులందరికీ ఐపిఎం కిట్లు, జీవశిలీంద్ర నాశిని ప్యాకెట్లను అందచేశారు. కార్యక్రమం లో వి హెచ్ ఏ రాజేశ్వరి, గ్రామ రైతులు పాల్గొన్నారు.