telanagana
ఉపాధి హామీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: ఎంపీడీవో సృజన సాహిత్య
మోమిన్పేట, మేజర్ న్యూస్: మోమిన్పేట మండలంలోని గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో సృజన సాహిత్య అధికారులకు, సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంలో విబిజి రాంజీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గ్రామంలో చేపడుతున్న ఫారం పాండ్ పనులు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ బిచ్చయ్య, ఏపీవో శంకరయ్య, పంచాయతీ కార్యదర్శి రాణి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.