BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

ఏసీబీ వలలో వేములవాడ రూరల్ తహసీల్దార్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి

Select Suryaa Now
ఏసీబీ వలలో వేములవాడ రూరల్ తహసీల్దార్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి

 

రూ.8 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు……

సూర్య వేములవాడ రూరల్ :రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఎం.డి. అబూబకర్ (ఏఓ-1), అదే కార్యాలయంలో భూ భారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కుమార్ (ఏ-2)ను గురువారం (అక్టోబర్ 15) కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి అత్తకు చెందిన వ్యవసాయ భూమిని ఆయన తండ్రి పేరుపై గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు సహకరించాలనే అధికారిక పని కోసం తహసీల్దార్ అబూబకర్ రూ.8,000 లంచం డిమాండ్ చేసి, ప్రైవేట్ వ్యక్తి అనిల్ కుమార్ ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనిల్ కుమార్ వద్ద నుంచి అతడి సూచన మేరకు లంచం సొమ్ము రూ.8,000ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక విధులను దురుద్దేశంతో నిర్వహించి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితులిద్దరినీ కరీంనగర్‌లోని SPE, ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వివరాలను వెల్లడించడం లేదని తెలిపింది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని తెలంగాణ ఏసీబీ అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్‌లో ‘Telangana ACB’, ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌)లో ‘@TelanganaACB’ ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీ క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉందని, ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.