BREAKING
గ్రామసమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:సర్పంచ్ మల్లమ్మ మల్లేశం ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా దుర్గామాత శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి పూజలు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తికి డా. దాశరథి – డా. సినారె గజల్ పురస్కారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి నూతన ప్రభుత్వ వైద్యశాల సూపర్డెంట్ ను కలిసిన 108 సిబ్బంది లలితాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు ఓర్వకల్లు మేజర్ న్యూస్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఓర్వకల్లు మండల పరిధిలోని లొద్దిపల్లె, హుస్సేనాపురం, నన్నూరు గ్రామాల్లో అమ్మవారు లలితాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యల లలిత త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనం లలిత త్రిపుర సుందరిగా చిన్నారి అవిష సైనోజీ.. ఆకట్టుకున్న వేషధారణ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ పావని సోమిశెట్టి గాంధీనగర్‌లో బైక్ ప్రమాదం.. యువకుడు మృతి తాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న కనుమూరు హరిశ్చంద్ర రెడ్డ ఎదులాబాద్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సందీప్ రెడ్డి

యువతకు స్ఫూర్తిదీపం.. అబ్దుల్ కలాం

Select Suryaa Now
యువతకు స్ఫూర్తిదీపం.. అబ్దుల్ కలాం

దేశ సేవలో చెరగని ముద్ర వేసిన మహనీయుడు

ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం

భారతరత్న జయంతి సందర్భంగా ఘన నివాళి

సూర్య స్టేట్ బ్యూరో అమరావతి : 

 మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  పేర్కొన్నారు. అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా గురువారం ఆయనకు ఘన నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా దేశానికి ఎనలేని సేవలందించడంతో పాటు రాష్ట్రపతిగా భారతదేశ ఔన్నత్యాన్ని మరింత పెంచిన మహనీయుడు కలాం అని కొనియాడారు. తన ప్రసంగాలతో విద్యార్థులు, యువతలో స్ఫూర్తి నింపి ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన గొప్ప మార్గదర్శకుడని పేర్కొన్నారు. నిరాడంబర జీవనం, క్రమశిక్షణ, దేశభక్తితో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. భారతరత్న అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన విశిష్ట సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు.