telanagana
ఎదులాబాద్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సందీప్ రెడ్డి
ఘట్కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 15): ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కందకట్ల సందీప్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, వేముల మహేష్ గౌడ్, సామల అమరేందర్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సేవలందిస్తానని సందీప్ రెడ్డి పేర్కొన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.