telanagana
గ్రామసమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:సర్పంచ్ మల్లమ్మ మల్లేశం
పూడూరు ,మేజర్ న్యూస్(అక్టోబర్ 15):గ్రామంలో ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ మల్లమ్మ మల్లేశం పేర్కొన్నారు.గురువారం మండల పరిధిలోని పుడుగుర్తి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నీటీని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.బుగ్రబజలాలు పెంచడం కొరకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం,ఉప సర్పంచ్ తిర్మలయ్య,పంచాయతీ కార్యదర్శి రాజు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.