ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ పావని సోమిశెట్టి
రేపల్లె మేజర్ న్యూస్; పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ గా డాక్టర్ వి. పావని సోమిశెట్టి పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో పనిచేసిన డాక్టర్ పృద్వి గణేష్ కొలసాని జనరల్ సర్జన్ గా యధావిధిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, కార్యాలయ సిబ్బంది డాక్టర్ వి పావని సోమిశెట్టి కు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ పావని సోమిశెట్టి రాకతో రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బాలల వైద్య విభాగానికి మరింత బలోపేతం లభిస్తుందని, తద్వారా అనేక మంది చిన్నారులకు మెరుగైన చికిత్స అందుతుందని వైద్యులు తెలిపారు. రేపల్లె ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, ముఖ్యంగా బాలల ఆరోగ్యంపై ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపించడం ద్వారా ఎందరో తల్లిదండ్రులు ఉపశమనం పొందుతారు అన్నారు. ఆమెకున్న అపారమైన వైద్య జ్ఞానం, బాలల వైద్యంలో ఆమెకున్న ప్రత్యేక నైపుణ్యం, నిబద్ధతతో కూడిన సేవలు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు.