శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా దుర్గామాత
. చింతపల్లి మేజర్ న్యూస్.. ఐదవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంగా దుర్గామాత ప్రజలకు దర్శనం ఇచ్చారు. చింతపల్లి మండలంలోని వివిధ మండపాల వద్ద దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించారు. ఐదవ రోజు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాల్ వెంకటేశ్వర్ నగర్ లోని స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఊరే. లక్ష్మణ్ , మద్దెల.కృష్ణ, బండారు సీతారాములు , గోవర్ధనాచారి, కిరాణం అసోసియేషన్ సభ్యులు సురేష్, రమేష్, విటల్, భవాని భక్తులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా మాల్ శ్రీ గాయత్రి పీఠంలో అమ్మవారిని ఐదవ రోజు ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీ గాయత్రి పీఠం వ్యవస్థాపకులు క్రోవిడి .సత్య సాయి బాబా శాస్త్రి , భక్తులు తదితరులు ఉన్నారు. చాకలి శేరిపల్లి గ్రామంలో సాయంత్రం దుర్గామాత భక్తులకు, గ్రామస్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు దుర్గామాత భక్తులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.