ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు,మేజర్ న్యూస్:
మునుగోడు గ్రామ పంచాయితీ పరిధిలోని లక్ష్మీదేవి గూడెంలో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలని ఇటీవల గ్రామస్తులు స్థానిక మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా హైదరాబాద్ లోని ఎంఎల్ఏ నివాసానికి వెళ్ళి విన్నవించారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 2లక్షల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం తన వంతుగా రూ.2,00,000/- నగదును ఆ గ్రామానికి చెందిన బండారు శంకర్ ఖాతాలో జమ చేయించారు. ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి విరాళం అందజేసిన
ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.