ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి... తాహసిల్దార్ కె. వరప్రసాద్
బాడంగి, సూర్య : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ, నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా విధులు నిర్వహించాలని మండల తహసీల్దార్ కె. వరప్రసాద్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని మండల రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, సర్వేయర్లకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు, గోడపత్రాలు, హోర్డింగులను తొలగించడం, విగ్రహాలకు ముసుగులు వేయడం, శిలాఫలకాలపై పేర్లు కనిపించకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళి అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా, ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.