BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

గజలక్ష్మి అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

Select Suryaa Now
గజలక్ష్మి అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్  :   నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు అమ్మవారిని 'శ్రీ గజలక్ష్మి' దేవిగా అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గురువారం జరిగిన వివిధ పూజా కార్యక్రమాలకు దాతలు ఉభయకర్తలుగా వ్యవహరించారు. శ్రీ గజలక్ష్మి అలంకారానికి నిప్పో ఛైర్మన్ అండ్ ఎం.డి పొట్టిపాటి ద్వారకనాథ్ రెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వరస్వామి ఆలయంలో జరిగిన శ్రీ లలితా కుంకుమార్చన, మహాన్యాస పూజలకు  వేణుగోపాల్ - సాయి స్నేహిత దంపతులు, సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పుష్పాలంకారానికి నెల్లూరుకు చెందిన  వెంకట రమేష్‌కుమార్ - సువర్ణలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
ఈ వేడుకలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ముఖ్య ఉత్సవ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ ఏలూరు శిరీష, ధర్మకర్తల మండలి సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించారు.