BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న 55 అడుగుల రావణాసురుడి బొమ్మ*

Select Suryaa Now
అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న 55 అడుగుల రావణాసురుడి బొమ్మ*

 

సంగారెడ్డి ; సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం పరిశీలించారు. రావణ దహనం కోసం సిద్ధం చేస్తున్న 55 అడుగుల రావణాసురుడి బొమ్మతో పాటు బాణసంచా కాల్చేందుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.గత ముప్పై ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ రావణాసురుడి బొమ్మ దహనం, పెద్ద ఎత్తున బాణసంచా ప్రదర్శనతో పాటు ప్రముఖ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జగ్గారెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా స్టేడియంతో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జగ్గారెడ్డి సూచించారు. ముళ్లకంపలను తొలగించి, చెత్తాచెదారం లేకుండా మైదానాన్ని శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందికి, ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, భవాని యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బెస్త నగేష్, సభ్యులు, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్ , శ్రీహరి, కౌన్సిలర్ శ్రీకాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు