అడెల్లి మహా పోచమ్మ తల్లి గంగనీళ్ల జాతర తేదీలు ఖరారు
సూర్య, సారంగాపూర్ జిల్లాలోనే ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటైన అడెల్లి మహా పోచమ్మ తల్లి గంగానీళ్ల జాతర తేదీలు ఖరారు అయ్యాయి.ఈనెల 17,18 తేదీలలో గంగనీళ్ల జాతర ఉంటుందని,ఆలయ అధికారులు తెలిపారు.ఈనెల 17 వ తేదీ శనివారం రోజున అమ్మవారి ఆభరణాలను,అడెల్లి మహా పోచమ్మ ఆలయం నుండి దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి గ్రామా గోదావరి చెంతకు ఊరేగింపుగా,వేలాది భక్తుల మధ్యలో బయలుదేరి,18 వ తేది ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఆభరణాలు గోదావరి జలాలతో దేవాలయానికి చేరుకుంటాయి.