పంపిణీకి సిద్ధంగా సన్న బియ్యం
చీపురుపల్లి, సూర్య : చీపురుపల్లి మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ధరణి కె ఎన్ ఎం బియ్యం బస్తాలు సుమారు 269 ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ పి అప్పలనాయుడు, సిఎస్ డిటి నాగలక్ష్మి గురువారం విలేకరులకు తెలిపారు. ఆధార్ కార్డు ఆధారంగా లబ్ధిదారులకు 26 కేజీల బియ్యం ప్యాకెట్ ను రూ.1300 లకు అందజేస్తున్నామని ఈ సందర్భంగా వారు వివరించారు. బియ్యం కావాలనుకునే వారు స్థానిక రైతు బజార్ వద్ద మార్కెట్ కమిటీ కార్యాలయంలో సంప్రదించి ఆధార్ కార్డుతో కార్యాలయం వద్దకు హాజరు కావాలన్నారు. ఆధార్ కార్డు ప్రకారం బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం రాయితీపైన అందజేస్తున్న ధరణి కెఎన్ఎం రైస్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రిపోర్టర్ : మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా.