కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
మండలపరిధిలోబొరుసువారిసావరంలోని వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ తెలుగు సినీ రచయిత,దర్శకుడు కురసాల కళ్యాణ్ కృష్ణ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి,శాలువాతో ఘనంగా సత్కరించారు.