BREAKING
ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట

కోస్టల్ బ్యాంకు 58వ శాఖ ప్రారంభం

Select Suryaa Now
కోస్టల్ బ్యాంకు 58వ శాఖ ప్రారంభం

 

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 : గత 26 సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ తన 58వ శాఖను మారేడుబాకలో నూతనంగా ప్రారంభించింది. బ్యాంక్ సీఎఫ్‌వో అండ్ సీఎంజీఎం కె.ఏ.వి. రమణ చే నూతన శాఖ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ గోదావరి రీజినల్ మేనేజర్ యు. హరిప్రియ, మారేడుబాక శాఖ మేనేజర్ వంక నారాయణరావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు 12 జిల్లాల్లో ఇప్పటివరకు 57 శాఖల ద్వారా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా మారేడుబాకలో 58వ శాఖను ప్రారంభించినట్లు వెల్లడించారు. విజయనగరం, ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు మరో 12 శాఖల ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏకైక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ అని పేర్కొన్నారు. కోస్టల్ బ్యాంక్ ద్వారా ఖాతాదారులకు ఆకర్షణీయమైన డిపాజిట్ వడ్డీ రేట్లు అందిస్తున్నామని, సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.60 శాతం వడ్డీ కల్పిస్తున్నామని తెలిపారు. పొదుపు ఖాతాల్లో రూ.25 లక్షలకు పైబడిన నిల్వలపై 7 శాతం వరకు వడ్డీ అందిస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.వివాహ ఖర్చుల కోసం కోస్టల్ కళ్యాణమస్తు రుణం, ఇళ్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు గృహ రుణాలు, బంగారు ఆభరణాలపై తక్షణ రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హతకు లోబడి ఆదాయపు పన్ను రిటర్నులు లేకున్నా గృహ రుణాలు పొందే అవకాశం ఉందన్నారు.అలాగే బ్యాంక్ ఏజెంట్ల ద్వారా ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు, వ్యవసాయ భూమి అభివృద్ధికి ఎకరానికి రూ.5 లక్షల వరకు రుణం, చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు ‘భూయజమాని’ ప్రత్యేక రుణ పథకం అందుబాటులో ఉన్నాయని వివరించారు. వీటితో పాటు వాహన రుణాలు, వ్యవసాయ ఉత్పత్తుల వేర్‌హౌస్ రసీదులపై రుణాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి బిల్డర్లకు టర్మ్ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

మారేడుబాకలో ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన శాఖను ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఆధునిక బ్యాంకింగ్ సేవలతో పాటు ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలు, వివిధ రకాల రుణ సదుపాయాలను ప్రజలకు చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు.