BREAKING
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్

కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి

Select Suryaa Now
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 1,200 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అధ్యాపకులు గురువారం హైదరాబాద్‌లో భారీ ధర్నా నిర్వహించారు. ‘చలో హైదరాబాద్’ పిలుపులో భాగంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి తరలివచ్చిన అధ్యాపకులు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు యూజీసీ ఏడో పీఆర్సీ వేతనాలను అమలు చేయాలని నినదించారు. ఈ ధర్నాలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. రెండు మూడు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల్లో విద్యాబోధన, పరిశోధన, పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వేతనాలు చెల్లించాలని కోరారు.

11 రోజుల సమ్మె చేసినా నెరవేరని హామీ

గత ఏడాది ఏప్రిల్‌లో 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగ భద్రత, ఏడో పీఆర్సీ వేతనాల అమలు తదితర డిమాండ్లతో 11 రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించారని ఆర్. కృష్ణయ్య గుర్తుచేశారు. ఈ సమ్మె కారణంగా విశ్వవిద్యాలయాల్లో విద్యాబోధనకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించారని తెలిపారు. అయితే నేటికీ ఆ హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

రిక్రూట్‌మెంట్‌తో 1,200 మంది భవిష్యత్తుకు ముప్పు

విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా జీవో నంబర్ 31 జారీ చేయడంపై ఆర్. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా 20 నుంచి 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న 1,200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారిని రెగ్యులర్ అధ్యాపకులుగా విలీనం చేసిన తర్వాతే మిగిలిన ఖాళీల భర్తీ చేపట్టాలని స్పష్టం చేశారు. రిక్రూట్‌మెంట్ పేరుతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను పక్కనపెడితే వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. పని భారం లేదనే కారణంతో కొందరు ఉపకులపతులు వారిని విధుల నుంచి తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సుమారు 3 వేల ఖాళీల్లో 1,200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను కొనసాగించడం ప్రభుత్వానికి భారమేమీ కాదని పేర్కొన్నారు.

విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి

యూజీసీ నిబంధనల ప్రకారం నెట్, సెట్, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి అర్హతలతో పాటు బోధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో అనుభవం కలిగిన అధ్యాపకులు విశ్వవిద్యాలయాల్లో సేవలందిస్తున్నారని ఆర్. కృష్ణయ్య తెలిపారు. శాశ్వత అధ్యాపకులతో సమానంగా విద్యార్థులకు బోధన అందిస్తున్న వారి సేవలను గుర్తించాలని కోరారు. తెలంగాణ విద్యా కమిషన్ సైతం అర్హత కలిగిన కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ అధ్యాపకులుగా విలీనం చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని పేర్కొన్నారు. ఈ సిఫారసులను వెంటనే అమలు చేసి, అర్హులైన అధ్యాపకులను సేవల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి

సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులకు అనుగుణంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్. కృష్ణయ్య కోరారు. రెగ్యులరైజేషన్ లేదా విలీనం ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ యూజీసీ ఏడో పీఆర్సీ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 1,200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టులను మినహాయించి మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ ధర్నాలో డాక్టర్ పరుషరాం, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ వెంకటేశ్వర్లు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగోర్ల మోడీరాందేవ్ యాదవ్, సి. రాజేందర్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.