BREAKING
రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

గీతంలో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవం -"నాట్యోత్సవ్‌–2026"లో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు

Select Suryaa Now
గీతంలో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవం  -"నాట్యోత్సవ్‌–2026"లో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ క్యాంపస్‌లో ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ‘నాట్యోత్సవ్‌–2026’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్కృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ కూచిపూడి గురువు, పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చిన సత్యం కళా వారసత్వానికి నివాళులర్పించారు.ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమం మంగళంతో ముగిసింది. తొమ్మిది మంది విద్యార్థులు బ్రహ్మాంజలి, జతీస్వరం,మురుగ శబ్దం, భామాకలాపం,తరంగం వంటి సంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అభిగ్న మురుగ శబ్దంలో భావ వ్యక్తీకరణతో మెప్పించగా, భామాకలాపంలో సత్యభామ పాత్రలో హర్ష ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.ముఖ్య అతిథిగా పాల్గొన్న నాట్య నివేదన వ్యవస్థాపకుడు గురువు చిరంజయ్‌ పొద్దార్‌ మాట్లాడుతూ..కూచిపూడి నృత్యంలో నైపుణ్యం సాధించాలంటే నిరంతర సాధన, క్రమశిక్షణ, అంకితభావం అవసరమన్నారు. డాక్టర్‌ వెంపటి చిన సత్యం కూచిపూడి కళారూపానికి చేసిన సేవలను కొనియాడారు. సంప్రదాయ కళలను సంరక్షిస్తూ భావితరాలకు అందించాలని సూచించారు.కార్యక్రమంలో విదుషి అంజు అరవింద్‌, విద్వాన్‌ ఆనందు మురళి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించిన గీతం విద్యార్థులు అధునాతన పరిశోధనలు, సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహన అధునాతన పరిశోధనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకునేందుకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ క్యాంపస్‌కు చెందిన 33 మంది విద్యార్థులు, నలుగురు అధ్యాపకులు గురువారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌)ను సందర్శించారు. గీతం మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటనలో మెకానికల్‌, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విభాగాల పరిశోధనలను పరిశీలించారు.ఈ సందర్భంగా రోబోటిక్స్‌, సాఫ్ట్‌ మ్యాటర్‌,మైక్రోస్విమ్మర్స్‌, ఇన్నోవేషన్‌ హబ్‌, కాంక్రీట్‌, విండ్‌ టన్నెల్‌ ప్రయోగశాలలను సందర్శించారు. స్వయంచాలక రోబోట్లు, డ్రోన్లు, నీటి అడుగున తనిఖీ వ్యవస్థలు, త్రీడీ ప్రింటింగ్‌, అధునాతన కాంక్రీట్‌ సాంకేతికతలు, విండ్‌ టన్నెల్‌ పరీక్షల గురించి తెలుసుకున్నారు.విద్యార్థుల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత శాస్త్రాలపై ఆసక్తిని పెంపొందించడం, పరిశోధనల వైపు ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రయోగశాలలను సందర్శించడం ద్వారా పరిశోధనల ఆచరణాత్మక ఉపయోగాలపై విద్యార్థులు ప్రత్యక్ష అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్‌ కె.మల్లేశ్వరి,టి.రాజ్‌ ప్రియాంక,డాక్టర్‌ జ్యోతి రశ్మి నాయక్‌,డాక్టర్‌ సౌపర్ణి పాల్‌ పాల్గొన్నారు.