BREAKING
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్

ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలోని కృషి భవన్‌లో ఆత్మ  ఆధ్వర్యంలో  గురువారం నాడు ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి పి. సత్యవాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వ్యవసాయ రంగంలో మహిళా రైతుల పాత్ర, ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.అలాగే జిల్లా వ్యవసాయ అధికారి పి. సత్యవాణి స్వాగత ఉపన్యాసం చేస్తూ, వ్యవసాయ రంగంలో మహిళా రైతులు అందిస్తున్న సేవలు, వారి కృషి ఎంతో విలువైనవని పేర్కొన్నారు. మహిళా రైతుల అభివృద్ధికి అవసరమైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. అనంతరం ఆత్మ జిల్లా ప్రాజెక్టు మేనేజర్  ఉషారాణి మాట్లాడుతూ..అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవ విశిష్టతను వివరించారు. ఆత్మ ఆధ్వర్యంలో మహిళా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారి నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే డీడీఏ,డీఆర్‌సీ వి. సుమలత కార్యక్రమానికి మోటివేటర్ గా వ్యవహరిస్తూ, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లుగానే వ్యవసాయ రంగంలోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు, పూల మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయం వంటి రంగాల్లో మహిళా రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.  అలాగే ఏఆర్‌ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వినీత మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. మహిళా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు సాంకేతికత, వ్యవసాయ యాంత్రీకరణ తదితర అంశాల్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  కృషి విజ్ఞాన కేంద్రం (కె. వి. కె ) చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.వి. సరళ మాట్లాడుతూ, మహిళా రైతులకు చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల తయారీ, ఊరగాయల తయారీ, సబ్బుల తయారీ, అరటి నారతో బుట్టల తయారీ, అల్లికలు తదితర అంశాల్లో శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. మహిళా రైతులు ఈ శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ ఏడీఏ డి. సుజాత మాట్లాడుతూ, మహిళా రైతులు తప్పనిసరిగా (ఏ. పి ఫ్.ఆర్ )రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఫ్. పి ఓ ) లు ద్వారా అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, ప్రయోజనాలను మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
నెల్లూరు ఏడీఏ బి. శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు.  కోవూరు ఏడీఏ  అనిత మాట్లాడుతూ, మహిళా రైతులను ఛాంపియన్ రైతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించుకొని, వినూత్న పద్ధతులను అనుసరించాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు (వి. ఏ. ఏ )చురుకుగా పాల్గొని మహిళా రైతులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని పేర్కొన్నారు.
మహిళా రైతుల ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై చర్చ  కార్యక్రమంలో మహిళా రైతులు వ్యవసాయంలో తాము అనుసరిస్తున్న ఉత్తమ వ్యవసాయ పద్ధతులను  వివరించారు. సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు, కిచెన్ గార్డెన్స్, పంటల యాజమాన్య పద్ధతులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతల అమలులో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఉత్తమ పద్ధతులను ఇతర మహిళా రైతులు కూడా అనుసరించి వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
మహిళా రైతులకు సన్మానం :  కార్యక్రమం ముగింపులో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న మహిళా రైతులను అధికారులు ఘనంగా సన్మానించారు. మహిళా రైతుల సేవలను అభినందిస్తూ, వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో మహిళా రైతులు, మహిళ వ్యవసాయ అధికారులు, మహిళా గ్రామ వ్యవసాయ సహాయకులు (వి. ఏ. ఏ)లు పాల్గొన్నారు. మహిళా రైతుల నైపుణ్యాభివృద్ధి, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ పథకాల సద్వినియోగం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.