BREAKING
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు జాబితాలో పేరు లేకపోవడంతో మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన నద్దునూరి స్వరూప గురువారం నిరసనకు దిగారు. తన ఇద్దరు కుమారులతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ, అర్హులైన తనకు ఇల్లు మంజూరు కాకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో విడత జాబితాలోనూ పేరు లేకపోవడంతో నిరాశకు గురైనట్లు తెలిపారు. తన కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, లబ్ధిదారుల ఎంపికలో అర్హతను మరోసారి పరిశీలించాలని కోరారు. జాబితాలో పేరు లేకపోవడానికి కారణాలను అధికారులు స్పష్టం చేసి, అర్హత ఉంటే ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్, రామకృష్ణ ,భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా