BREAKING
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్

జగ్గయ్యపేట లో భూ మేత!

Select Suryaa Now
జగ్గయ్యపేట లో భూ మేత!

జగ్గయ్యపేటలో భూ మేత!

_పుట్టబజారులో మరో జిల్లా పరిషత్ స్థలం కబ్జాకు యత్నం.._

_కోట్ల రూపాయల విలువైన 30 సెంట్లకుపైగా స్థలంపై అక్రమార్కుల కన్ను.._

_ఒకవైపు ఎన్నికల బిజీలో అధికారులు.. మరోవైపు కబ్జాకు ప్రయత్నాలు!_

    పట్టణంలోని పుట్టబజారులో ఉన్న జిల్లా పరిషత్‌కు చెందిన దాదాపు 30 సెంట్లకుపైగా కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎంతో విలువైన స్థలం కబ్జాకు గురైంది.
    పుట్టబజార్‌లోని మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ స్థలంలో ఇదివరకు ఆలయం పేరుతో గుడి నిర్మించారు. మరో స్థలంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దాని పక్కనే లేడీస్ వస్త్ర దుకాణం కూడా పెట్టారు. ఇప్పుడు వీటి మధ్యలో ఉన్న 30 సెంట్లకు పైగా ఖాళీ స్థలంపై కొందరి కన్ను పడింది. స్థలాన్ని చదును చేయిస్తున్నారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తలా రెండు సెంట్ల చొప్పున పంచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
    నెల రోజుల క్రితం అధికారులు "ఇది జిల్లా పరిషత్‌కు సంబంధించిన భూమి" అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని కూడా కొందరు తొలగించారు. ఒకవైపు స్థానిక ఎన్నికల నేపథ్యంలో మునిసిపల్, రెవెన్యూ అధికారులు, పోలీసులు విధుల్లో బిజీగా ఉండగా మరోవైపు ఇదే అదునుగా భావించి కొంతమంది స్థలం కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలోని వాటర్ ప్లాంట్, వస్త్ర దుకాణాన్ని తొలగించడంతో పాటు కొత్తగా కబ్జాకు గురికాబోతున్న భూమిని కూడా  అక్రమార్కుల చెర నుంచి కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే కఠిన చర్యలు తీసుకుంటారా? లేక ఎప్పటిలాగే మిన్నకుంటారో వేచి చూడాలి!

 

 

 

రిపోర్టర్ :శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా