BREAKING
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్

విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Select Suryaa Now
విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువుకు బట్టలు ఉతకడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నరసింహారెడ్డి, అతని భార్య కృష్ణవేణి, అతని సోదరుడు సంగమేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలోకి నెట్టుకుపోయింది. ఈ సందర్భంగా గురువారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మృతుల నివాసానికి వెళ్లి, వారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన జరిగిన విధానం, మృతికి దారితీసిన కారణాల గురించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం అత్యంత దుఃఖకరమని, ఈ ఘటనపై తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఎమ్మెల్యే తెలిపారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై అవగాహన కల్పించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చెరువుల వద్ద భద్రతా చర్యలు, ప్రజలకు అప్రమత్తత తప్పనిసరని కూడా వెల్లడించారు. వారి వెంట ఆత్మ చైర్మన్ వినోద్ పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, నారాయణఖేడ్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధ రెడ్డి, రాఘవ చారి కాంగ్రెస్ నాయకులు, పండరి రెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి రెడ్డి సర్పంచ్, మానూర్ గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు

ఎం సంతోష్ నిజాంపేట్ మండల రిపోర్టర్…