BREAKING
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్

చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి

Select Suryaa Now
చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి

 

తెలంగాణ బ్యూరో ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాంపల్లిలోని చేనేత భవన్‌లో తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ చేనేత వస్త్రాలకు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, ఈ వృత్తిపై ఆధారపడిన కార్మికుల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాలు, అధికారిక కార్యక్రమాలు, ఉపాధ్యాయులు, ప్రముఖుల సన్మానాలు తదితర సందర్భాల్లో సాధారణ సిల్క్ శాలువాలకు బదులుగా చేనేత శాలువాలను వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాజకీయ నాయకులు పరస్పరం గౌరవించుకునే కార్యక్రమాల్లోనూ చేనేత శాలువాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేలా అన్ని ప్రభుత్వ శాఖలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. చేనేత రంగంలో ముడిసరుకు సమకూర్చడం నుంచి వస్త్రాల తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ సంబంధిత వర్గాలకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించి, వారి శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా చూడాలన్నారు. చేనేత రంగం అభివృద్ధి చెందితే కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం లభిస్తాయని చెప్పారు. నూతన చైర్మన్ విద్యార్థి దశ నుంచి రాజకీయ జీవితంలో కష్టపడి పనిచేసిన స్ఫూర్తితో చేనేత రంగ అభివృద్ధికి మరింత అంకితభావంతో కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.