BREAKING
కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం! ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!!

ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..

Select Suryaa Now
ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..

అమలాపురం మేజర్ న్యూస్ ​వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ ఆస్పత్రిఆధ్వర్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సభ & ర్యాలీ​అక్టోబర్ 10న కిమ్స్ డాక్టర్లు, విద్యార్థులతో 'స్వచ్ఛ కోకో బీచ్' కార్యక్రమం నేటి ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయనిప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు పిలుపునిచ్చారు.​ప్రపంచ గుండె దినోత్సవం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మంగళవారం అమలాపురం కిమ్స్  ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న కల్యాణమండపంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే  అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. "వైద్యులు, మెడికో విద్యార్థులు రోజూవారీ పనిలో తీవ్ర ఒత్తిడి, టెన్షన్‌ను ఎదుర్కొంటారు. వారికి తగినంత విశ్రాంతి, రీఫ్రెష్‌మెంట్ ఇచ్చేలా ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు అవసరం," అని తెలిపారు.​సభలో కిమ్స్ చైర్మన్  చైతన్య రాజు 'స్వచ్ఛ అమలాపురం' ప్రతిపాదించగా, ఎమ్మెల్యే  స్పందిస్తూ 'స్వచ్ఛ కోకో బీచ్' కార్యక్రమాన్ని చేపడదామని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన చైతన్య రాజు, రాబోయే అక్టోబర్ 10న కిమ్స్ మెడికో స్టూడెంట్స్, డాక్టర్లతో కలసి కోకో బీచ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు 'స్వచ్ఛ బీచ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
​అలాగే ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో రాష్ట్రంలోనూ, అమలాపురం నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.​అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కిమ్స్ హాస్పిటల్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ చైర్మన్  చైతన్య రాజు, కిమ్స్ ఎం డి రవి వర్మ, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, బోనం సత్తిబాబు, శర్మ, ఆసుపత్రి వైద్యులు, మెడికల్ విద్యార్థులు, సిబ్బంది, కూటమి నాయకులు  స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.