ప్రధాని మోడీ సారధ్యంలో దేశంలో అభివృద్ధి వికాసం
- మదనపల్లెలో వికసిత్ భారత్ సంకల్ప సభ దిగ్విజయం
- హాజరైన బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి
మదనపల్లె : అన్నమయ్య
జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని టౌన్ హాల్ నందు బుధవారం వికసిత్ భారత్ సంకల్ప సభ విజయవంతంగా నిర్వహించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా అక్టోబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్ సంకల్ప సభను నిర్వహించడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి అన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈరోజు వరకు సెలవు అనేది తీసుకోకుండా నిరంతరం దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.సమావేశం అనంతరం బిజెపి కార్యకర్తలు మద్దతుదారులందరూ టౌన్ హాల్ నుండి అన్నమయ్య సర్కిల్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యల్లంపల్లి ప్రశాంత్,విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.సేతు,జిల్లా ప్రధాన కార్యదర్శులు గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి,మదన్మోహన్ బాబు,భువనేశ్వరి సత్య,జిల్లా కార్యదర్శి బర్నేపల్లి రవికుమార్,రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పురుషోత్తం,బిజెపి నాయకులు విష్ణు చైతన్య,ఆకుల కృష్ణమూర్తి,వరదారెడ్డి నారదా రెడ్డి,జర్మన్ రాజు,నవీన్,శ్రీకాంత్,సాంబశివ తదితరులు పాల్గొన్నారు.
కె. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి