BREAKING
ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్! కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టిఐ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న. చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్. సూర్య స్పోర్ట్స్ డెస్క్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్! ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్సార్సీ చైర్మన్ రాజగోపాల్, మహీధర్ రెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి: నీరుడు పవన్ సాయి ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్

విజయవాడ, మేజర్ న్యూస్: జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ ఆదివారం విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలోని ఎస్.ఆర్.ఆర్. ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, ఎన్నికల నియమావళి అమలును సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

కొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు షామియానా ఏర్పాటు చేయడంతో పాటు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.

ఎన్టీఆర్ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివారం ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలో 16.38 శాతం, కొండపల్లిలో 20.94 శాతం, తిరువూరులో 31.09 శాతం, నందిగామలో 34.31 శాతం, జగ్గయ్యపేటలో 29.30 శాతం పోలింగ్ నమోదైంది. నందిగామలో అత్యధికంగా 34.31 శాతం పోలింగ్ నమోదుకాగా, విజయవాడలో అత్యల్పంగా 16.38 శాతం నమోదైంది.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.