BREAKING
ఘనంగా విజయదశమి వేడుకలు రేపల్లె జెడ్పీటీసీ బరిలో బీజేపీ అభ్యర్థి జుజ్జవరపు సురేష్‌ ఆత్మకూరులో పోలీస్ కవాతు అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి.. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఒకే కుటుంబంలో 26 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు.. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు పొందాలి: బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు భారీ పోలీస్ బందోబస్తు ప్రధాని మోదీ సమక్షంలో కళా ప్రదర్శనకు అవకాశం బాపట్లలో ‘ఫ్రెండ్లీ ఎలక్షన్స్‌’పై జనసేన దృష్టి! ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి సీఏఆర్‌లో మెగా రక్తదాన శిబిరం.. స్వయంగా రక్తదానం చేసిన సీపీ బి. సుమతి దలేర్ మెహందీకి మద్దతుగా నిలిచిన అనుపమ్ ఖేర్.. వేదికపై గాయకుడిని పబ్లిక్‌గా నిలదీయడం తగదంటూ వ్యాఖ్యలు! మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అభ్యర్థుల జాబితా ప్రకటన ఈనెల 25 వరకు వాయిదా! తాళ్లపేటలో దాడి.. ముగ్గురికి గాయాలు నంద్యాల మునిసిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా డాక్టర్ బాబన్ కు బీ-ఫామ్ అందజేసిన మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ముగింపు.. 450 ఎపిసోడ్ల తర్వాత భావోద్వేగంగా వీడ్కోలు పలికిన ఏక్తా కపూర్!

పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం - పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,

Select Suryaa Now
పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం  - పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,

పార్వతిపురం అక్టోబర్ 21 మేజర్ న్యూస్ ...పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమర వీరుల కుటుంబాలతో జిల్లా కలక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి , ఎస్పీ  ఎస్.వి.మాధవ్ రెడ్డి అక్టోబరు 21న అమరవీరులు కుటుంబసభ్యులుతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా అమరులైన స్వర్గీయ  ముద్దాడ గాంధీ గారి  సతీమణి మనోరంజని మరియు వారి కుటుంబ సభ్యులు , స్వర్గీయ బి.శ్రీరాములు సతీమణి ప్రమీల  మరియు  వారి కుటుంబ సభ్యులతో, స్వర్గీయ సూర్యనారాయణ సతీమణి రాజు  మరియు  వారి కుటుంబ సభ్యులుతో మమేకమై, వారి యోగ క్షేమాలు, ఆర్దిక , మానసిక, పిల్లల చదువు గురించి, పోలీస్, ఇతర శాఖాల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నయా అని  అడిగి తెలుసుకొన్నారు.అనంతరం పోలీసు అమర వీరుల కుటుంబాలతో కలసి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు అల్పాహారం చేసి, వారితో కొంత సమయాన్ని గడిపారు. ఎప్పుడు ఏ అవసరమున్నా పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు  తమను సంప్రదించ వచ్చునని తెలిపి, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న భరోసాను జిల్లా ఎస్పీ గారు  కల్పించారు.ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహర్, పార్వతీపురం డిఎస్పీ శేషయ్య,పాలకొండ డిఎస్పీ రాంబాబు, ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సిఐ రమణమూర్తి,ఆర్ఐలు నాయుడు,రాంబాబు, పార్వతీపురం టౌన్ సిఐ వెంకట్రావు, రూరల్ సిఐ రంగనాధం పాల్గొన్నారు.

పి సతీష్ కుమార్ స్టాఫ్ రిపోర్టర్ పార్వతీపురం మన్యం జిల్లా.