BREAKING
పోలీసుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనంతపురంలో ఘనంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పాసింగ్ అవుట్ పరేడ్ అక్రమార్జనతో అంతస్తులు కట్టుకుంటే... ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండ ప్రభావం ఐలమ్మ జీవితం స్పూర్తి దాయకం యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ లో అధునాతన ఈ ఎన్ టి వాయిస్ ఎయిర్ వే చికిత్సలు ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసు ఇరాన్ గొడవలు, AI శోభలను మర్చిపోండి కిక్కిరిసిన క్యూ లైన్లు .. సర్వదర్శనానికి 15 గంటలు లక్కీ డ్రా లో సైకిల్ బహుమతిని గెలుచుకున్న వల్లాలతేజ యాదవ్ బాండ్ మార్కెట్‌లో కలకలం భారత్‌లో రాబోయే 6 నెలల్లో 15,800 అదనపు వేడి మరణాలు! పోలవరం వద్ద పోటెత్తిన వరద ముంబైలో వైభవంగా గణేశ్ విసర్జన వేడుకలు

పోలవరం వద్ద పోటెత్తిన వరద

Select Suryaa Now
పోలవరం వద్ద పోటెత్తిన వరద

ఏలూరు: అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 5,36,938 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే వద్ద నీటిమట్టం 30.720 మీటర్లకు చేరింది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పోలవరం పరివాహక ప్రాంతాలు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే నీటిమట్టం కూడా పెరిగే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.