ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
ప్రభుత్వానికి జిల్లా రజక అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యదర్శి సోమరాజు వెంకటేష్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 26 : చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా రజక అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యదర్శి సోమరాజు వెంకటేష్ కోరారు. శనివారం కందుకూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సోమరాజు వెంకటేష్ మాట్లాడుతూ... చాకలి ఐలమ్మ సేవలను స్మరించుకుంటూ ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. అలాగే గ్రామాల్లోని రజక కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందించి, వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొమ్మరాజు మల్లేష్, మండల నాయకులు సుధాకర్, నరేష్, వెంకటేష్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
- తోకల శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూర్