telanagana
తాండూరులో ధూమ్-ధామ్ గా రోడ్ షో చేసిన తీన్మార్ మల్లన్న
*పెద్ద ఎత్తున బీసీ శ్రేణులతో ర్యాలీ సాగించిన తీన్మార్
*తీన్మార్ కు దూరంగా ఉన్న తాండూరు బీసీ నేతలు
తాండూరు ,మేజర్ న్యూస్(సెప్టెంబర్ 26);తాండూరు పట్టణంలో శనివారం ఉదయం తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆదినేత ఎమెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేశారు.నిన్న తాండూరులో జరిగిన రోడ్ షో లో రెడ్డిల పై గర్జించిన విషయం తెలిసిందే.నిన్న రాత్రి తాండూరు టౌన్ లోని ఎంపీటీ హాల్ లో బాసు చేసిన మల్లన్న ఉదయం పూట టౌన్ లోని శివాజీ చౌక్,ఇందిరా చౌక్,ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతం మీదగా పాద యాత్ర చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఐనా కొడంగల్ వైపు వెళ్లారు.మల్లన వెంట వచ్చిన బీసీ పార్టీ శ్రేణులతో ధూమ్ ధామ్ గా పాదయాత్ర సాగించారు.తీన్ మార్ మల్లన్న వెంట తాండూరు ప్రాంతానికి చెందిన బీసీ నేతలు ఒక్కరు కూడా లేకపోవడం ఘమనర్వం.మొత్తం మీద మల్లన్న యాత్రకు బీసీ లు దూరంగా ఉన్నట్టు చెప్పవచ్చు.ఇదిలా ఉండగా తాండూరులో బీసీ లము అంటూ తరచుగా గగ్గోలు పెట్టే నేతలు ఒక బీసీ నేత చేపట్టిన పాదయాత్రకు ఎందుకు దూరంగా ఉన్నారని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పార్టీలు వేరైనా ఒక బీసీ ఉద్యమ నేత తాండూరు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగానైనా కలవకపోవడం ఏమిటని పలువురు చేర్చించుకుంటున్నారు.నిన్న తాండూరులో జరిగిన సభలో రెడ్డిల పై వేలుమల పై తీన్ మార్ మల్లన్న ఫైర్ కావడం తో ఎక్కడ చూసినా చర్చ సాగుతుంది.