BREAKING
ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసు ఇరాన్ గొడవలు, AI శోభలను మర్చిపోండి కిక్కిరిసిన క్యూ లైన్లు .. సర్వదర్శనానికి 15 గంటలు లక్కీ డ్రా లో సైకిల్ బహుమతిని గెలుచుకున్న వల్లాలతేజ యాదవ్ బాండ్ మార్కెట్‌లో కలకలం భారత్‌లో రాబోయే 6 నెలల్లో 15,800 అదనపు వేడి మరణాలు! పోలవరం వద్ద పోటెత్తిన వరద ముంబైలో వైభవంగా గణేశ్ విసర్జన వేడుకలు ఆసియా క్రీడల్లో ధీరజ్ బొమ్మదేవర సరికొత్త రికార్డు.. రికర్వ్ క్వాలిఫికేషన్‌లో అగ్రస్థానం, టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రెండో స్థానం థానేలో వృద్ధుడిపై అసభ్యకర దూషణలు, దాడి.. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐరాస వేదికగా పాకిస్తాన్ అబద్ధాలు, వంచనను ఎండగట్టిన భారత్.. సీమాంతర ఉగ్రవాదానికి తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరిక ఉత్తరాఖండ్ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిత్వంపై బీజేపీ కోర్ కమిటీ విస్తృత కసరత్తు.. సీఎం ధామీ నేతృత్వంలో త్రిసభ్య ప్యానెల్ ఏర్పాటు తాండూరులో ధూమ్-ధామ్ గా రోడ్ షో చేసిన తీన్మార్ మల్లన్న మహిళా శక్తికి నిదర్శనం వీఆర్వో సుమిత్ర రోగం నయం చేస్తానంటూ మైనర్ బాలికపై తాంత్రిక పూజారి అత్యాచారం.. బాందాలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు

మహిళా శక్తికి నిదర్శనం వీఆర్వో సుమిత్ర

Select Suryaa Now
మహిళా శక్తికి నిదర్శనం వీఆర్వో సుమిత్ర

తాటాకులతో వరద రోడ్డును మూసేసి ప్రాణాలు కాపాడిన వీఆర్వో..!!

వీఆర్వోను అభినందించిన తహశీల్దార్, గ్రామస్తులు..!!

 

 

 

 

 

పద్మనాభం, సెప్టెంబర్ 25,మేజర్ న్యూస్:

విపత్తు సమయంలో ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత ఎలా ఉండాలో పద్మనాభం మండలం మద్ది గ్రామానికి చెందిన వీఆర్వో సుమిత్ర నిరూపించారు. తుఫాన్ కారణంగా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని తన సమయస్ఫూర్తితో అడ్డుకుని, ఎంతోమంది ప్రాణాలను కాపాడారు.గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తునిపొలం గ్రామం వద్ద ప్రధాన రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. రోడ్డు ఎక్కడో, వరద ఉధృతి ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ రోడ్డుపై నుంచి వాహనాలు వెళితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఆ సమయంలో అక్కడ సహాయానికి ఎవరూ అందుబాటులో లేరు. పై అధికారులకు సమాచారం ఇచ్చినా, వారు వచ్చేలోపు ప్రమాదం జరగవచ్చని గ్రహించిన వీఆర్వో సుమిత్ర ఏ మాత్రం ఆలస్యం చేయలేదు.
వెంటనే ఆమె దగ్గరలో ఉన్న కోళ్ల ఫారం వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న కత్తిని తీసుకున్నారు. రోడ్డు పక్కన పడి ఉన్న తాటిచెట్టు కమ్మలను తన శక్తికి మించి నరికి, వాటిని తీసుకొచ్చి వరద ముంచెత్తిన రోడ్డుకు అడ్డంగా వేశారు. ఆ రోడ్డుపై ఎవరూ రాకపోకలు చేయకూడదని, తద్వారా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఆమె సొంతంగా తాత్కాలిక బారికేడ్ ఏర్పాటు చేశారు. వర్షంలో తడుస్తూ, బురదలో నడుస్తూ ఒక మహిళ చేసిన ఈ సాహసానికి అందరూ ఫిదా అయ్యారు. వీఆర్వో సుమిత్ర చొరవ వల్లే ఈ రోజు ఎలాంటి ప్రమాదం జరగలేదని, వీఆర్వో చేసిన సహాయానికి తునిపొలం ప్రజలు, నాయకులు అభినందించారు.  

*తహసిల్దార్ శైలజ ప్రశంసలు:*
వీఆర్వో సుమిత్ర చేసిన సాహసాన్ని తెలుసుకున్న పద్మనాభం మండల తహశీల్దార్ శైలజ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు."వీఆర్వో సుమిత్ర చూపిన తెగువ, సమయస్ఫూర్తి అభినందనీయం. విధి నిర్వహణలో ఆమె బాధ్యతను మించి పనిచేశారు. ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా, అందుబాటులో ఉన్న వనరులతో ప్రజల ప్రాణాలను కాపాడటం గొప్ప విషయం. ఇలాంటి ఉద్యోగులు మా మండలానికి గర్వకారణం. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని సుమిత్ర నిరూపించారు" అని తహశీల్దార్ శైలజ కొనియాడారు.