ఈవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
నెల్లిమర్ల, సెప్టెంబర్ 25;
స్థానిక ఈవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. గోదాముల షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను తెరిపించి, లోపలి గదులను పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. సిసి కెమేరాల ద్వారా చుట్టుప్రక్కల పరిస్తితులను పరిశీలించారు. అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
ఆర్‌డిఓ సుధాసాగర్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటిండెంట్ ప్రసాద్, ఇతర రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.