ప్రజా సమస్యలపై లోకం మాధవి దృష్టి
భోగాపురం, సెప్టెంబర్ 25, (మేజర్ న్యూస్):
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ముంజేరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై వచ్చిన వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే వెంట భోగాపురం క్లస్టర్ ఇంచార్జ్ పల్లంట్ల జగదీష్ తదితర నాయకులు పాల్గొన్నారు.