BREAKING
ప్రజా సమస్యలపై లోకం మాధవి దృష్టి ముగిసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన.. చర్చల్లో పురోగతిపై ట్రంప్, జిన్‌పింగ్ హర్షం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి.. సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ జముయి బాధితురాలి ఫొటోను బహిర్గతం చేయడంపై బిహార్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి.. తేజస్వి యాదవ్ డిమాండ్ విజిలెన్స్ దర్యాప్తు జాప్యాలకు చెక్.. కేరళలో సరికొత్త డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రారంభం ఆత్మకూరును రాష్ట్రంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తమిళగ వెట్రి కళగంలో అన్నాడీఎంకే మాజీలకు కీలక బాధ్యతలు.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దళపతి విజయ్ దృష్టి ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చేవెళ్ల లడ్డూ రూ.28.11లక్షలు పల్లె పండుగ కార్యక్రమం పరిశీలకులుగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్/ అదనపు ఎన్నికల -అధికారి వై.ఓ. నందన్ పొర్లుకట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రేపు సాయంత్రానికి వినాయక నిమజ్జనం పూర్తి మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత

పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Select Suryaa Now
పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

రూ.1.10 లక్షల జరిమానా.. బాధితురాలి తల్లిదండ్రులకు రూ.లక్ష నష్టపరిహారం

విశాఖపట్నం, సెప్టెంబర్ 25, మేజర్ న్యూస్: మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన కేసులో నిందితుడికి విశాఖపట్నం స్పెషల్ పోక్సో కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. జరిమానాలో రూ.10 వేలను రాష్ట్ర ప్రభుత్వానికి, రూ.లక్షను బాధితురాలి తల్లిదండ్రులకు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

2022లో ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ కేసు నమోదైంది. 17 ఏళ్ల మైనర్ బాలికను నిందితుడు ఉండ ఎర్ని విజయ్ గణపతి కృష్ణ కుమార్ బయటకు తీసుకెళ్లి, ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడంతో ఆమె మృతి చెందినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విచారణ అనంతరం నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించిన న్యాయస్థానం శిక్ష, జరిమానా విధించింది.
న్యాయస్థానం తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు