BREAKING
ముగిసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన.. చర్చల్లో పురోగతిపై ట్రంప్, జిన్‌పింగ్ హర్షం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి.. సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ జముయి బాధితురాలి ఫొటోను బహిర్గతం చేయడంపై బిహార్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి.. తేజస్వి యాదవ్ డిమాండ్ విజిలెన్స్ దర్యాప్తు జాప్యాలకు చెక్.. కేరళలో సరికొత్త డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రారంభం ఆత్మకూరును రాష్ట్రంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తమిళగ వెట్రి కళగంలో అన్నాడీఎంకే మాజీలకు కీలక బాధ్యతలు.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దళపతి విజయ్ దృష్టి ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చేవెళ్ల లడ్డూ రూ.28.11లక్షలు పల్లె పండుగ కార్యక్రమం పరిశీలకులుగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్/ అదనపు ఎన్నికల -అధికారి వై.ఓ. నందన్ పొర్లుకట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రేపు సాయంత్రానికి వినాయక నిమజ్జనం పూర్తి మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక

పొర్లుకట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

Select Suryaa Now
పొర్లుకట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

పొర్లుకట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

నెల్లూరు సిటీ, , మేజర్ న్యూస్:  నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 48వ డివిజన్‌ పొర్లుకట్ట ప్రాంతంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ శుక్రవారం పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూ.48 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, రూ.7 లక్షలతో చేపట్టనున్న లైటింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళల విజ్ఞప్తి మేరకు 27 మరుగుదొడ్ల నిర్మాణానికి మంత్రి ఆమోదం తెలిపారు.

వర్షాకాలంలో పొర్లుకట్ట ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రోడ్డు నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీ మేరకు పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడంతో పాటు లైటింగ్‌ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

రోడ్డు నిర్మాణం సందర్భంగా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇళ్లు పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

పొర్లుకట్ట ప్రాంతంలో 27 మరుగుదొడ్ల నిర్మాణ పనులను శనివారం నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

స్థానిక ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల మహిళలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి మహిళలు మంగళహారతులు ఇచ్చి, పూలవర్షంతో స్వాగతం పలికారు.

రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్‌ అజీజ్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు రోడ్డు సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం అభినందనీయమన్నారు. రోడ్డు, లైటింగ్‌ సౌకర్యాలతో పాటు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, విద్య తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ భానుప్రతాప్, కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.