BREAKING
ప్రజా సమస్యలపై లోకం మాధవి దృష్టి ముగిసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన.. చర్చల్లో పురోగతిపై ట్రంప్, జిన్‌పింగ్ హర్షం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి.. సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ జముయి బాధితురాలి ఫొటోను బహిర్గతం చేయడంపై బిహార్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి.. తేజస్వి యాదవ్ డిమాండ్ విజిలెన్స్ దర్యాప్తు జాప్యాలకు చెక్.. కేరళలో సరికొత్త డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రారంభం ఆత్మకూరును రాష్ట్రంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తమిళగ వెట్రి కళగంలో అన్నాడీఎంకే మాజీలకు కీలక బాధ్యతలు.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దళపతి విజయ్ దృష్టి ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చేవెళ్ల లడ్డూ రూ.28.11లక్షలు పల్లె పండుగ కార్యక్రమం పరిశీలకులుగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్/ అదనపు ఎన్నికల -అధికారి వై.ఓ. నందన్ పొర్లుకట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రేపు సాయంత్రానికి వినాయక నిమజ్జనం పూర్తి మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత

ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

Select Suryaa Now
ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం  అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

 

ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం

అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

వెంకటాచలం మేజర్ న్యూస్ :    ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ పంచాయతీలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోర్టు రోడ్డు నుంచి రామదాసుకండ్రిగ, ఇడిమేపల్లి, ఈదగాలి మీదుగా పూడిపర్తి వరకు రూ.4 కోట్లతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. రూ.11.15 లక్షలతో నిర్మించిన శ్మశానవాటిక ప్రహరీని ప్రారంభించారు. గూడూరు నుంచి రామదాసుకండ్రిగ మీదుగా నెల్లూరుకు పునరుద్ధరించిన బస్సు సర్వీసును ప్రారంభించారు. స్త్రీనిధి ద్వారా రెండు గ్రూపులకు రూ.13 లక్షలు, బ్యాంకు లింకేజీ ద్వారా మరో గ్రూపునకు రూ.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రామదాసుకండ్రిగలో రూ.4.90 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని సోమిరెడ్డి తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్‌ నిధులను గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖలను గాడిలో పెట్టి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోకుల్‌ కంపెనీకి 11.70 ఎకరాలు కేటాయించామని, సంతోషిమాత కంపెనీకి 22 ఎకరాలు కేటాయించనున్నట్లు చెప్పారు. రైతులకు గతంలో ఎకరాకు రూ.19 లక్షలు మాత్రమే అందేవని, ప్రస్తుతం రూ.35 లక్షలు ఇప్పించామని, అదనంగా మరో రూ.2 లక్షలు కూడా ఇప్పించనున్నట్లు తెలిపారు.ఇరిగేషన్‌ పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పని చేయకుండా బిల్లులు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను, నీటి సంఘాల ప్రతినిధులను హెచ్చరించినట్లు చెప్పారు. ప్రతి కాలువ పనికి ముందు, తర్వాత జీపీఎస్‌ ఆధారిత ఫొటోలు తీస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు.