BREAKING
అంగన్వాడి కేంద్రం లో ఉత్సవాలు .! *ఉత్సవాల్లో సూపర్ వైజర్ తాడ్డి. శ్రీదేవి.! భారీ వర్షాలకు కూలిన ఇల్లు ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ భోగాపురం ప్రత్యేక అధికారిగా వెంకటేశ్వరరావు బాధిత కుటుంబాలను పరామర్శించిన బేబి నాయన ప్రజా సమస్యలపై లోకం మాధవి దృష్టి ముగిసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన.. చర్చల్లో పురోగతిపై ట్రంప్, జిన్‌పింగ్ హర్షం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి.. సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ జముయి బాధితురాలి ఫొటోను బహిర్గతం చేయడంపై బిహార్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి.. తేజస్వి యాదవ్ డిమాండ్ విజిలెన్స్ దర్యాప్తు జాప్యాలకు చెక్.. కేరళలో సరికొత్త డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రారంభం ఆత్మకూరును రాష్ట్రంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తమిళగ వెట్రి కళగంలో అన్నాడీఎంకే మాజీలకు కీలక బాధ్యతలు.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దళపతి విజయ్ దృష్టి ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చేవెళ్ల లడ్డూ రూ.28.11లక్షలు

అంగన్వాడి కేంద్రం లో ఉత్సవాలు .! *ఉత్సవాల్లో సూపర్ వైజర్ తాడ్డి. శ్రీదేవి.!

Select Suryaa Now
అంగన్వాడి కేంద్రం లో ఉత్సవాలు .!                               *ఉత్సవాల్లో సూపర్ వైజర్ తాడ్డి. శ్రీదేవి.!

           
మెరకముడిదాం సెప్టెంబర్ 25 మేజర్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజాసేవలను పురస్కరించుకొని సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి ఉత్సవాలు మరియు పోషణ మహా కార్యక్రమంను   ఇప్పలవలస గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి టి. శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ  కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో  మూడు రోజులపాటు అంగన్వాడి ఉత్సవాలు జరుతున్నామన్నారు.  ఈనెల 26 నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకారం ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రంలో అందించే సేవలు గురించి, ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులకు  వివరించారు. ఈ సందర్భంగా ప్రీస్కూల్ పిల్లల తల్లి ఆర్. కుమారి మాట్లాడుతూ తమ పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీ స్కూల్ విద్య, పౌష్టికాహారము, ఆరోగ్యపరమైన సేవలు అందిస్తున్నందుకు అంగన్వాడీ టీచర్స్ కు ఆయాలకు వైద్య సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ బాలిక ఆర్. మౌలిక మాట్లాడుతూ పౌష్టికాహారము, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తున్న అంగన్వాడి సిబ్బందికి వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. తల్లులు అంగన్వాడి సేవలు గుర్తింపుగా అంగన్వాడీ టీచర్స్ ని పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇప్పలవలస అంగన్వాడీ టీచర్లు కె. పద్మ, ఆర్ వర్మ, ఆశా కార్యకర్తలు గ్రామంలో తల్లులు లబ్ధిదారులు కిషోర్ బాలికలు పాల్గొన్నారు.