బాధిత కుటుంబాలను పరామర్శించిన బేబి నాయన
తె ర్లాం సెప్టెంబర్ ,25 మేజర్ న్యూస్ మండలం లో విద్యుదా ఘా తానికి మరణించిన కుటుంబాలను బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే.కే రంగారావు బేబీ నాయన శుక్రవారం పరామర్శించారు. గొ లుగు వలస లో కరెంట్ షాక్ తో మరణించిన కాబోతుల పొలిరాజు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని ఇచ్చారు. జరిగిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతిని కుటుంబాన్ని ఓదార్చే అన్నిరకాల పారితోషికం కోసం సంభందిత అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్. ఆమిటి లో ఇటీవల కరెంటు స్థంభం మీద పడి మృతి చెందిన ములగపాక అచ్చయమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడి ఆయా కుటుంబాలకు ప్ర భుత్వం తరుపున సాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బొబ్బిలి ఎ
ఎం. సి ఛైర్మన్ ఎన్ వెంకట నాయుడు టిడిపి అధ్యక్షుడు నర్సుపల్లీ వెంకటేశ్వర రావు టి. డిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు