శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి దాతల భక్తి కానుక
కీ శే. పన్నాల ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం రూ.3.30 లక్షల విరాళం
నేడు సువర్ణ ధ్వజస్తంభ అలంకరణ పూజ
దాతలకు కృతజ్ఞతలు: చైర్మన్ శ్రావణ్ కుమార్ గుప్త
మేడ్చల్ జిల్లా ప్రతినిధి(పన్నాల బాల్ రెడ్డి),మేజర్ న్యూస్, (సెప్టెంబర్, 26): భక్తి, సేవాభావంతో కీసరలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ధికి దాతలు చేయూత అందిస్తున్నారు. ఆలయ ధ్వజస్తంభానికి తొడుగు ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులకు దాతలు అందించిన విరాళాలతో ఆలయానికి మరింత శోభ చేకూరుతోంది.
ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే. పన్నాల ప్రభాకర్ రెడ్డి (పప్పు) అన్న జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి సువర్ణ తొడుగు ఏర్పాటు కోసం రూ.3.30 లక్షల విరాళాన్ని అందించారు.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఈ విరాళాన్ని అందించారు. కీ.శే. పన్నాల ప్రభాకర్ రెడ్డి సోదరుడు పన్నాల సుధాకర్ రెడ్డి, ఆయన భార్య జ్యోతి రాణి (కీసర), సోదరి కందకట్ల సుజాత, కీ.శే. సంజీవరెడ్డి కుటుంబ సభ్యులు (రాఘవాపురం) కలిసి ధ్వజస్తంభం సువర్ణ తొడుగు ఏర్పాటుకు సహకరించారు.
*కీ.శే. పద్మలత జ్ఞాపకార్థం రూ.లక్ష విరాళం:
రామాలయంలో ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం విశ్రాంత తెలుగు పండిట్ తిరుక్కోవలూరి టీ. భాస్కర స్వామి, ఆయన కుమారులు శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ కలిసి కీ.శే. పద్మలత జ్ఞాపకార్థం రూ.1 లక్ష విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ కమిటీ పేర్కొంది.
*నేడు ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజ:
దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సువర్ణ ధ్వజస్తంభానికి నేడు సెప్టెంబర్ 26న ఉదయం 9 గంటలకు ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. కీసర గ్రామ ప్రజలు, పెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు సకాలంలో హాజరై పూజలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ చైర్మన్ రాయిల శ్రావణ్ కుమార్ గుప్త విజ్ఞప్తి చేశారు.
*దాతలకు శ్రావణ్ కృతజ్ఞతలు:
ఆలయ అభివృద్ధికి ఉదారంగా సహకరిస్తున్న దాతలకు చైర్మన్ రాయిల శ్రావణ్ కుమార్ గుప్త ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో దాతలు, భక్తుల సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. దాతల కుటుంబాలపై శ్రీ సీతారామచంద్ర స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆనబోయిన జంగయ్య ముదిరాజ్, కోశాధికారి జూపల్లి రవీందర్, కమిటీ సభ్యులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సువర్ణ ధ్వజస్తంభ అలంకరణ పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.