సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం
సూర్య జగిత్యాల ప్రతినిధి:ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమిష్టి కృషితో నిమజ్జనాన్ని పూర్తి చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలో 3500 పైగా గణేష్ మండపాల నుండి విగ్రహాలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయబడ్డాయని నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్యశాఖలు సిబ్బంది సహకారంతో సమన్వయంగా పనిచేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఎస్పీ అన్నారు. గడిచిన 11 రోజులపాటు 24 గంటలు పని చేసిన పోలీస్ అధికారులను అభినందించారు.