పట్నం దంపతులతో పారిజాత భేటీ
పార్టీ బలోపేతం పై చర్చ
ఇటీవల రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి ఈ ఉదయం శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు సుదీర్ఘకాలంగా జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా రెడ్డి దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి బోకే అందించారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి, సునీత రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వెళ్లాలని ఆమెకు మహేందర్ రెడ్డి, సునీత రెడ్డి లు సూచించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బాలాపూర్ డివిజన్ అధ్యక్షుడు నిరుడు శ్రీరాములు, నాయకులు కృష్ణంరాజు గౌడ్, నరహరి గౌడ్ తదితరులు ఉన్నారు.
- శేరిబాయి గణేష్, మేజర్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి.