BREAKING
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హోమ్‌గార్డ్ కమాండెంట్‌ను కలిసిన REF నాయకులు నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి కోలాహలంగా ప్రారంభమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ .. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం ఈ నెల 27 నుంచి ప్రారంభం.. తహసీల్దార్ సహా ముగ్గురు సస్పెన్షన్ పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి బలూచిస్థాన్‌లో దశాబ్దాలుగా పాకిస్థాన్ దారుణ అణచివేత.. ఐరాస వేదికగా బీఎన్ఎం చీఫ్ తీవ్ర ఆరోపణలు

లండన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

Select Suryaa Now
లండన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

లండన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

శ్రీ గణేశ యువజన సంఘం ఆధ్వర్యంలో వరుసగా 11 రోజుల పాటు ఆధ్యాత్మిక సందడి

£7,116కు లడ్డూ వేలం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భక్తుల భాగస్వామ్యం

 

లండన్ : శ్రీ గణేశ యువజన సంఘం లండన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు వరుసగా 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. లండన్‌లో సంఘం ఆధ్వర్యంలో వరుసగా మూడోసారి వినాయక చవితి వేడుకలను విజయవంతంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సంఘం ప్రతినిధులు తెలిపారు.11 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో లండన్‌లో గణేశ్ నవరాత్రుల సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం అందించారు.ఈ సందర్భంగా శ్రీ గణేశ యువజన సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. “వేడుకలను ఇంత ఘనంగా విజయవంతం చేయడానికి సహకరించిన లండన్‌లోని హిందూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. భక్తుల అపూర్వ స్పందన, సహకారం వల్లే ఈ ఉత్సవాలు విజయవంతమయ్యాయి” అని తెలిపారు.సంఘ సభ్యుల కృషి, భక్తుల భాగస్వామ్యం, సమిష్టి సహకారంతో 11 రోజుల పాటు పూజా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు.

£7,116కు లడ్డూ వేలం

వినాయక చవితి వేడుకల్లో నిర్వహించిన లడ్డూ వేలం కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జయంత్ గుప్తా మాచెర్ల  £7,116కు లడ్డూను సొంతం చేసుకోవడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.లండన్‌లో వరుసగా మూడోసారి శ్రీ గణేశ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవడం వెనుక సహకరించిన ప్రతి ఒక్కరికీ సంఘం సభ్యులు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులోనూ అందరి సహకారం, ఆశీస్సులతో మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని శ్రీ గణేశ యువజన సంఘం లండన్ సభ్యులు తెలిపారు.గణపతి బప్పా మోరియా! ????
జై శ్రీ గణేశా! ????️????