BREAKING
నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. దిగువకు విడుదల సాంకేతిక భాషా దినోత్సవం – బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుంది పిల్లల డిజిటల్ భద్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హోమ్‌గార్డ్ కమాండెంట్‌ను కలిసిన REF నాయకులు నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి కోలాహలంగా ప్రారంభమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ .. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం

Select Suryaa Now
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి :: కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె 131వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ధైర్యంగా పోరాడిన వీరవనితగా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, నిబద్ధత, పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.సామాజిక అసమానతలు, దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం ప్రజాస్వామ్య విలువలను, సమానత్వ భావనను మరింత బలోపేతం చేసేలా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 

సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం కల్పించడమే చాకలి ఐలమ్మ ఆశయాలకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.చాకలి ఐలమ్మ సేవలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడంతో పాటు, ఆమె ఆశయాల సాధన దిశగా సమాజం ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్. వై.గిరి, తహసీల్దార్ హిమబిందు, బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్  చైర్మన్ ఇప్పా ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోదావరి స్వామి, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నాగరాజు, శివరాములు, కొత్తపల్లి మల్లయ్య, మహేశ్, రాజయ్య, శ్రీకాంత్, గణేష్, విఠల్, వినోద్, నాగభూషణం, టీఎన్జీవోస్ ' అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, నరేష్, పవన్, స్వామి, సునీత, విజయశాంతి, శాంతయ్య, కృష్ణప్రసాద్, శ్రీకర్ తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.