BREAKING
నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. దిగువకు విడుదల సాంకేతిక భాషా దినోత్సవం – బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుంది పిల్లల డిజిటల్ భద్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హోమ్‌గార్డ్ కమాండెంట్‌ను కలిసిన REF నాయకులు నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి కోలాహలంగా ప్రారంభమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ .. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం

పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి

Select Suryaa Now
పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి

పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి.
-- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

భూపాలపల్లి ప్రతినిధి,రేగొండ, సెప్టెంబర్ 26,మేజర్ న్యూస్.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న చారిత్రక, ప్రకృతి సౌందర్యానికి నిలయమైన పాండవుల గుట్ట వద్ద జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ శ్రీ సిరిసెట్టి సంకీర్త్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రకృతి సంపద, చారిత్రక వారసత్వం, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.పాండవుల గుట్టకు చారిత్రక, పురావస్తు ప్రాధాన్యతతో పాటు అపూర్వమైన ప్రకృతి అందాలు ఉన్నాయని,ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అజంతా,ఎల్లోరా గుహలను తలపించేలా ఉన్న పాండవుల గుట్టలో పురాతన శిలాచిత్రాలు, మహాభారత కాలాన్ని గుర్తు చేసే ఆనవాళ్లు కనిపిస్తాయని, సమీపంలో ఉన్న కోనేరు ఈ ప్రాంత ప్రత్యేకతను మరింత పెంచుతోందని వివరించారు.అలాగే పాండవుల గుట్ట సమీపంలోని బుగులోని వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గుట్టపైకి వెళ్లే మెట్లను వెడల్పు చేయడం, యాత్రికులకు నీడ కల్పించే విధంగా పిల్లర్లు ఏర్పాటు చేసి స్లాబ్ నిర్మించడం కోసం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బుగులోని జాతరకు హాజరయ్యే భక్తుల రాకపోకలు సులభతరం చేసేందుకు రహదారి అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.10 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా మన ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పరిరక్షించడం, పరిశుభ్రంగా ఉంచడం, వాటి చారిత్రక ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక కళాకారులు,చేతివృత్తిదారులు చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు అధికారులు పాండవుల గుట్ట పరిసర ప్రాంతాలను సందర్శించి అక్కడి సహజసిద్ధమైన రాతి నిర్మాణాలు, పురాతన ఆనవాళ్లు, ప్రకృతి అందాలను పరిశీలించారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి, టూరిజం జిల్లా అధికారి చిర్ర రఘు, పర్యాటకశాఖ అధికారులు, కొడవటంచ ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.