తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ
తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ.
భూపాలపల్లి సూర్యప్రతినిధి సెప్టెంబర్ 26,మేజర్ న్యూస్.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ధైర్యంగా పోరాడి, తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ. మధుసూదన్ చారి పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారి ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి, త్యాగాలను స్మరించుకున్నారు.