నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి
అనంతపురం బ్యూరో నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి
ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్ ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లాలో నేతన్న సేవా పథకానికి అర్హులైన చేనేత కార్మికులను గుర్తించే సర్వేను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జే.వి. రమణ, నాయకులు ఎస్.హెచ్. భాష డిమాండ్ చేశారు. ధర్మవరం చేనేత కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి పథకం వర్తింపజేయాలని కోరారు. కూలి మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులను కూడా పథకంలో చేర్చాలని, పెన్షన్‌కు ఉన్న అనవసర ఆంక్షలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే అర్హులైన కార్మికుల ఖాతాల్లో నగదు ఎప్పుడు జమ చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన తేదీ ప్రకటించాలని, సర్వే అనంతరం అర్హులైన వారికి గుర్తింపు కార్డులు అందించి చేనేత పింఛన్ మంజూరు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.