తహసీల్దార్ సహా ముగ్గురు సస్పెన్షన్
*భారీ వర్షాల సమయంలో విధుల్లో నిర్లక్ష్యం...
*వంగర తహసీల్దార్ సహా ముగ్గురు సస్పెన్షన్...
విజయనగరం : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం 24 గంటల కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించిన విషయం విధితమే.
ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వంగర తహసీల్దార్ (FAC) పి. రామారావు, సంగం VRO Grade-I U. రామచంద్రరావు, వంగర గ్రామ VRA కె. ఉదయ్ కిరణ్ లను సస్పెండ్ చేశారు.
తహసీల్దార్ అత్యవసర సమయంలో జిల్లా యంత్రాంగం ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, పరిస్థితిపై సమాచారం అందించకపోవడం, అరసాడ సమీపంలో రహదారి దెబ్బతిన్న ఘటనపై సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలతో సస్పెండ్ చేశారు.
సంగం VROకు అప్పగించిన కంట్రోల్ రూమ్ విధులను సక్రమంగా నిర్వహించకపోవడం, వంగర VRA కంట్రోల్ రూమ్ విధులకు హాజరుకాకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ముగ్గురిపైనా AP Civil Services (CCA) Rules, 1991లోని Rule 8(1) ప్రకారం చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.