BREAKING
భారత ఎన్నికల విశ్వసనీయతపై తీవ్ర చర్చ.. అపూర్వమైన పరిశీలన, ఆరోపణల వెనుక అసలు కారణాలివే సిరిసిల్లలో ఐలమ్మ జయంతి వేడుకలు.. మొరాకో పార్లమెంట్ ఎన్నికల్లో పీఏఎం భారీ విజయం.. మెజారిటీకి చేరువలో నిలిచిన పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటూనే ముప్పులను అరికట్టాలి.. ఐరాస వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు అమెరికా డీజిల్ ఎగుమతుల నిషేధం విధిస్తే పరిస్థితి ఏమిటి.. గ్లోబల్ ఇంధన మార్కెట్లో తీవ్ర సంక్షోభ ముప్పు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ రియాద్‌లో మిత్రదేశాల అత్యవసర భేటీ.. అణు కార్యక్రమం శాంతియుతమేనన్న ఇరాన్ ఐరాసలో ప్రసంగిస్తున్న నెతన్యాహును చూసి వాకౌట్ చేసిన అంతర్జాతీయ ప్రతినిధులు.. సొంతగడ్డపై మాత్రం హర్షాతిరేకాలు *ఓటర్ నమోదులో అక్రమాలే ఎజెండా *సీఈసీపై చర్యకు తీర్మానం? పాండమిక్ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి పట్నం దంపతులతో పారిజాత భేటీ సైనిక చర్యలతో హోర్ముజ్ జలసంధి భద్రత సాధ్యం కాదు.. పాశ్చాత్య దేశాలకు ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ గల్ఫ్ సంక్షోభం వేళ ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ.. శాంతి, భద్రతలపై న్యూయార్క్‌లో విస్తృత చర్చలు ఐలమ్మ వీర వనిత పోలీసుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనంతపురంలో ఘనంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పాసింగ్ అవుట్ పరేడ్

అక్రమార్జనతో అంతస్తులు కట్టుకుంటే...

Select Suryaa Now
అక్రమార్జనతో అంతస్తులు కట్టుకుంటే...

"జాతిపితలు" కాలేరు*

*అడ్డంగా సంపాదించిన ఆస్తులను ఉద్యమకారులకు పంచాలి*

*మరోసారి కెసిఆర్ పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"*

సెప్టెంబరు 26 : తెలంగాణ సెంటిమెంటు, అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులను తెలంగాణ ఉద్యమకారులకు పంచి పెడితే సూర్యచంద్రులు ఉన్నంతకాలం కెసిఆర్ పేరు నిలిచి ఉంటుందని, తాను కూడా కెసిఆర్ ను కీర్తిస్తానని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో రజక సంఘం, జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నివాళి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై నివళులర్పించారు. 
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని పాలన పేరిట ఆర్దిక విధ్వంసం జరిగిందని శంకర్ అన్నారు. గడిచిన బిఆర్ఎస్ పాలనలో అక్రమంగా ప్రజల సొత్తును కూడా పెట్టారని ఆరోపించారు. కెసిఆర్ ఆస్తులు అంతస్తులు అక్రమాలు దౌర్జన్యాలు పెచ్చు మీరి పోయాయని వివరించారు. తెలంగాణ సెంటిమెంటుతో కెసిఆర్ అనే కుటుంబం లాభం పొంది ఉద్యమకారుల కడుపులు కొట్టి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి సొంత ఆస్తులు కూడా పెట్టారని వీటిని కనుగొని ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీలో తాను ఒక సభ్యుడునని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. కెసిఆర్ అవినీతి చూసి మహనీయులు చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి ఆత్మలకు క్షోభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం వచ్చి రాష్ట్రం కోసం ఏదైనా సొంతంగా త్యాగం చేస్తే జాతిపితలు అవుతారని మంది సొమ్ము మింగి అంతస్తులు కూడా పెడితే వారిని జాతిపితలు అనరని అన్నారు. ఒకవేళ కెసిఆర్ పేరు సూర్య చంద్రులు ఉన్నంతకాలం చిరస్థాయిగా మిగిలాలంటే నాలాంటివారు కీర్తించాలంటే ఆయన అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను ఉద్యమకారులకు ప్రజలకు పంచిపెడితే జాతిపిత కచ్చితంగా అవుతాడని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. కెసిఆర్ తన అక్రమ ఆస్తులను ప్రజలకు త్యాగం చేస్తే సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయనను గౌరవిస్తాం పూజిస్తాం అంటూ ఎమ్మెల్యే శంకర్ సవాల్ విసిరారు. ప్రాంతం కోసం దేశం కోసం త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారని ఇలా అక్రమ ఆస్తులు ఎవరు కూడా పెట్టలేదని దేశంలోనే అక్రమ ఆస్తులు కూడబెట్టిన నేతల్లో కేసీఆర్ ప్రప్రథముడు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు నందిగామ రామచందర్, పెంటయ్య, శేఖర్, లింగారెడ్డిగూడెం అశోక్, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన విభాగం కోఆర్డినేటర్ రఘునాయక్, మాజీ జెడ్పిటిసి పంది వెంకట్రాంరెడ్డి, స్థానిక జేఏసీ చైర్మన్ మూలే జనార్ధన్. కరుణాకర్, చెంది తిరుపతిరెడ్డి, ముబారక్ అలీ ఖాన్, ఖదీర్, జాంగారి రవి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

- జవ్వోజి రాఘవేందర్, మేజర్ న్యూస్, షాద్నగర్